శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంతో ప్రాజెక్టుపై ఆధారపడిన జిల్లాలకు మంచిరోజులు రానున్నాయి..రాష్ట్రప్రభుత్వం ఎంతో ముందుచూపుతో నిర్మిస్తున్న ఈ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని నందిమేడారం వద్ద మోటార్ ట్రయల్ రన్ విజయవంతం కావడం..ఈ ఖరీఫ్ నుంచి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పునరుజ్జీవ పనులు కూడా ఊపందుకున్నాయి. ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశిస్తూనే మరోవైపు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.ఇప్పటికే 80శాతం మేర పనులవ్వగా మిగిలిన వాటిని మరో రెండు నెలల్లో పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
0 Comments