తానూరు, న్యూస్‌టుడే: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి పోరాటం చేశారని, సొంత రాష్ట్రం ఏర్పడినా వాటి ఫలాలను మాత్రం పొందలేకపోతున్నారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.వి.రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తానూరు, కోలూరు, భోసీ, ఝరీ(బి), బోర్గాం, బేల్‌తరోడ పాఠశాలల్లో సంఘ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు విద్యారంగం సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో ఆగస్టు 7న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు.
0 Comments